![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -462 లో.. బ్యాంకు ముందున్న ప్రేమని తీసుకొని వెళ్ళడానికి ధీరజ్ వస్తాడు. ఏంటి ఇక్కడున్నావ్.. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఏదో ల్యాండ్ మార్క్ కోసం ఇది చెప్పానని ప్రేమ అంటుంది. మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిందా అని ధీరజ్ అడుగుతాడు. రేపు ప్రొద్దున కాల్ చేయమందని ప్రేమ అంటుంది. ఇద్దరు అక్కడ నుండి వెళ్తారు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇంటికి వస్తారు. ప్రేమ, ధీరజ్, నర్మద ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉంటే వల్లి ఓర్వలేకపోతుంది వెంటనే బెల్ కొట్టి నాకు ఆకలిగా ఉంది మిరపకాయ బజ్జీలు చెయ్యమని చెప్తుంది.
దాంతో వెంటనే ప్రేమ, నర్మద చేస్తారు. నా బట్టలు ప్రేమ నువ్వు ఉతుకమని వల్లి చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక వల్లి చెప్పినట్లు చేస్తారు. ఆ తర్వాత అలసిపోయి కూర్చొని ఉంటారు. అప్పుడే ధీరజ్ వచ్చి వదిన మీతో ఆడుకుంటుంది. మీరు కూడా తనకి పనులు చేస్తూ ఆడుకోండి అని ధీరజ్ చెప్పగానే ప్రేమ, నర్మద కిచెన్ లోకి వెళ్లి కాకరకాయ జ్యూస్ తీసుకొని వచ్చి ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. వద్దని వల్లి అంటుంటే వేదవతిని పిలుస్తారు. వేదవతి దగ్గర ఉండి మరి శ్రీవల్లికి జ్యూస్ తాగిస్తుంది. మిమ్మల్ని ఆడుకోవాలనుకుంటే నన్నే ఆడుకుంటారా అని వల్లి అనుకుంటుంది. మరొకవైపు సాగర్ ఎండలో సైట్ దగ్గర ఉంటాడు. అప్పుడే తన మావయ్య వచ్చి.మ నిన్న ఆస్తుల గురించి మళ్ళీ డిస్కషన్ జరిగిందా అని అడుగుతాడు.
అప్పుడే అటుగా వెళ్తున్న రామరాజు, తిరుపతి ఆగి.. ఇంత ఎండలో కష్టపడుతున్నావు.. నీకు మిల్ లో పనిచేసుకోమని చెప్పాను.. అది వదిలేసి ఇలా చేస్తున్నావని రామరాజు అంటాడు. అక్కడ నుండి రామరాజు వెళ్ళాక.. చూసావా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో.. నువ్వు త్వరగా ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేయ్ అని సాగర్ తో శ్రీనివాసరావు చెప్తాడు. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తారు. సాగర్ మాత్రం బ్యాగ్ తో హాల్లోకి వస్తాడు. ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానని సాగర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |